![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -425 లో.... ఇందిరాదేవికి కావ్య కాఫీ తీసుకొని వస్తుంది. ఏం అవసరం లేదంటూ కావ్యని తిడుతుంది. ఎవరిని అతిగా ప్రేమించకూడదు.. ఏదైనా చెడు వ్యసనమే అని కావ్య తెచ్చిన కాఫీ ని తీసుకోకుండా వెనక్కి పంపిస్తుంది.
మరొకవైపు అప్పు.. మాయ అడ్రెస్ వెతుకుంటూ వస్తుంది. డోర్ కొట్టగానే ఒక అమ్మాయి డోర్ తీస్తుంది. ఎవరు మీరు? మీ పేరేంటని ఆమె అడుగుతుంది. మాయ కావాలని అప్పు అనగానే.. మాయ ఊరు వెళ్ళింది. ఇంతకు మీరు ఎవరని ఆ అమ్మాయి అడుగగా.. నేను తన చిన్ననాటి ఫ్రెండ్ ని.. ఎప్పుడు వస్తుందని అప్పు అడుగుతుంది. రేపు వస్తుందని ఆ అమ్మాయి చెప్తుంది. సరే నెంబర్ ఇవ్వమని అప్పు అడుగగా.. మీరెవరో తెలియకుండా ఎలా నెంబర్ ఇస్తానని ఆ అమ్మాయి అనగానే.. సరే నా నెంబర్ తీసుకొని తనకి ఇవ్వు.. వచ్చాక కాల్ చెయ్యమని చెప్పమని అప్పు నెంబర్ ఇస్తుంది. మరొకవైపు ఏదో సాధించినట్లు మాయ, రుద్రాణిలు కావ్య దగ్గరికి వచ్చి.. తను బాధపడేలా మాట్లాడతారు. అప్పుడే అప్పు ఫోన్ చేసి "గుడ్ న్యూస్.. అసలు మాయ గురించి తెలిసింది. తను ఊరు వెళ్ళింది, రేపు వస్తుంది" అని చెప్తుంది. ఆ తర్వాత మాయ బ్యాగ్ తీసుకొని హాల్లోకి వస్తుంది. ఎక్కడికి వెళ్తున్నావని స్వప్న అడుగుతుంది. నేను లోపల ఉండాలా.. బయట ఉండాలా.. మీరే చెప్పండి.. నా బాబు రాజ్ కి బాగా అలవాటు అయ్యాడు.. నా దగ్గరికి తీసుకొని వస్తే ఏడుస్తున్నాడు.. నేను బాబు దగ్గరే ఉంటానని మాయ అనగానే.. అంటే రాజ్ గదిలోకి వెళదామని అనుకుంటున్నావా అని స్వప్న అడుగుతుంది. అందరూ ఒకే అంటే అని మాయ అంటుంది. పళ్ళు రాలగొడతాను.. నువ్వు పెళ్లికాకుండా తల్లి అయ్యావ్. నిన్ను చూస్తుంటే కంపరంగా ఉందని ఇందిరాదేవి తిడుతుంది. పెళ్లి అయ్యాక ఎవరు ఎక్కడ ఉండాలి అని డిసైడ్ చేస్తానని అపర్ణ అంటుంది.
ఆ తర్వాత అపర్ణని అత్తయ్య అని మాయ పిలవగానే.. నువ్వు ఇంకొకసారి అలా పిలవకు.. ఏదో గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి చేస్తున్నా అంతే.. నువ్వు చేసిన పనికి నన్ను అత్తయ్య అని పిలిచే అర్హత లేదు.. ఇంకెప్పుడు అలా పిలవకంటూ అపర్ణ వార్నింగ్ ఇస్తుంది. మరొకవైపు అసలు అన్ని హక్కులు కావ్య కంటే మాయకే ఉంటాయని కళ్యాణ్ తో అనామిక అనగానే కళ్యాణ్ కోప్పడతాడు. తరువాయి భాగంలో మాయ దొరికిందన్న విషయం అప్పుతో కావ్య మాట్లాడుతుంటే.. రుద్రాణి వింటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాలిసిందే.
![]() |
![]() |